గ్రామస్తుల సహకారంతో తెరుచుకున్న బడి

రాయికల్, వెలుగు: గ్రామస్తుల సహకారంతో మూతపడిన బడి తెరుచుకుంది.  జగిత్యాల జిల్లా రాయికల్‌‌  మండలం మంక్త్యానాయక్‌‌  తండాలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో  విద్యార్థులు స్కూల్‌‌ కు వెళ్లలేదు. దీంతో అధికారులు గతేడాది ప్రైమరీ స్కూల్‌‌ ను మూసేశారు. 

ఈక్రమంలో మంక్త్యానాయక్‌‌  తండా, లోక్యానాయక్‌‌  తండాకు చెందిన గిరిజనులు స్కూల్​ కోసం నడుం బిగించారు. వేసవి సెలవుల్లో శ్రమదానం చేసి రోడ్డును బాగు చేశారు. అనంతరం స్కూల్‌‌  రీఓపెన్​ చేయాలని అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం 10 మంది పిల్లలతో స్కూల్‌‌ ను రీ ఓపెన్‌‌  చేశారు.