డేంజర్ బెల్స్ : డెంగ్యూ దోమలు పెరిగాయా.. బలంగా తయారయ్యాయా..?

దేశంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది..దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెంగ్యూకేసులు పెరుగుతున్నాయి. గతంలోకంటే అధికరెట్లు డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ వ్యాధి విస్తరణకు కారణమై దోమల సంతతి పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా నివేదికలు చెబుతున్నాయి. గతంలో కంటే ఈ వ్యాధివ్యాప్తికి కారణమైన దోమల తమ బలాన్ని పెంచుకొని వ్యాధి వ్యాప్తిని పెంచుతున్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇందుకు కారణం నిస్సందేహంగా వాతావరణంలో మార్పు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిరమైన వర్షపాత, పట్టణీకరణ, డెంగ్యూ వైరస్ వ్యాప్తి వాహకాలపై ఈడీఎస్ దోమల సంతానోత్పత్తిని పెంచుతున్నాయని పరిశోధనలో తేలింది. 

డెంగ్యూ ముప్పు శీతాకాలంలో అధికంగా ఉంటుంది.డెంగ్యూ అనేది దోమల సంక్రమించే వ్యాధి..రెండోసారి డెంగ్యూ వ్యాధి సోకితే చాలా ప్రమాదం.. డెంగ్యూ అనగానే అంతకంతకూ పడిపోయే ప్లేట్‌‌లెట్ కౌంట్ కీలక సమస్యగా మారుతుంది. అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల, కీళ్ల నొప్పులు, వ్యాధి తీవ్రత పెరిగితే ఇంటర్నల్ బ్లీడింగ్, షాక్ కు గురయ్యే లక్షణాలు డెంగ్యూ వ్యాధి లక్షణాలు. వ్యాధి ముదిరితే ప్రాణాంతకమవుతుంది. 

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నాగాలాండ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి..ఈ రాష్ట్రాల్లో డెంగ్యూకేసుల్లో పెరుగుదలకు కారణం.. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఉంటే వాతావరణంలో మార్పులు. విపరీతమైన వర్షాలు, కట్టడాలు, డ్రైనేజీ వ్యవస్థ. నీరు నిల్వ ఉండే అన్ని ప్రాంతాలు దోమల సంతానోత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రతల్లో మార్పు, వర్షాలు  దోమల సంఖ్య పెరిగేందుకు అనుకూలిస్తాయి.