చొప్పదండి మండలంలో రైస్​మిల్లుల్లో తనిఖీలు

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలంలోని వరలక్ష్మి, విరాజాక్షి రైస్​ మిల్లులను సివిల్​ సప్లై టాస్క్​ఫోర్స్​ టీం ఆఫీసర్లు మంగళవారం తనిఖీ చేశారు. సివిల్​ సప్లై ​టాస్క్​ఫోర్స్ స్టేట్ మెంబర్​ ప్రభాకర్​, జగిత్యాల డీసీవో వెంకటేశ్వరరావు, డీటీసీఎస్​ సురేందర్​ ఆధ్వర్యంలో మిల్లులకు కేటాయించిన నిల్వలను పరిశీలించారు.

నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించామని ఆఫీసర్లు తెలిపారు. వారి వెంట తహసీల్దార్​ నరేందర్, ఎస్సై ఉపేంద్రాచారి, ఉన్నారు.