దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో, సీఎంఆర్ బియ్యం డెలివరీల్లో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని నల్గొండ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం చింతకుంట్ల సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్నితనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులోకి తరలించాలని కొనుగోలు కేంద్రం అధికారులకు ఆదేశించారు.
ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ హరీశ్, దేవరకొండ డీటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, సైదులు,తిరుపతిరెడ్డి, సంబంధిత రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.