దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

  • సీఐటీయూ, ఐఎఫ్​టీయూ డిమాండ్​

బోధన్, వెలుగు: మున్సిపల్​ కార్మికులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం  మున్సిపల్ ఆఫీసు ముందు సీఐటీయూ, ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కార్మకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఐఎఫ్​టీయూ నాయకులు బి.మల్లేశ్​​, శంకర్​గౌడ్ మాట్లాడారు. ఈనెల 28వ తేదీన ఉదయం పట్టణంలోని గంజ్​రోడ్ లో శానిటేషన్​ కార్మికులు ఎల్లయ్య, సంతోష్​ పారిశుద్ధ్య పనులు చేస్తుండగా వారిపై అదేకాలనీకి చెందిన లక్ష్మణ్​, ఆయన భర్య స్వరూప, కుమారుడు కన్ను కర్రలతో దాడి చేశారన్నారు.

 కార్మికుడు ఎల్లయ్య చేతిలోని కొడవలిని బలవంతంగా లాక్కోవడంతో అతడి చేతికి గాయాలయ్యాయని తెలిపారు.  దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  అనంతరం మున్సిపల్​ ఆఫీసు నుంచి బోధన్​ పోలీస్​ స్టేషన్ వరకు ర్యాలీగా వెల్లి సీఐ వీరయ్యకు వినతిపత్రం అందించారు.    మున్సిపల్ జవాన్లు గోపి, గాబ్రియల్​, ఎం. గంగారాం, బి.రాజు, కార్మికులు గంగామణి, సాయమ్మ, పోశెట్టి, జి.సాయిలు పాల్గొన్నారు.