కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి : కొప్పుల శంకర్

  • కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని  సీఐటీయూ   జిల్లా  ప్రధాన కార్యదర్శి కొప్పుల  శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట  యూనియన్​ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో  ధర్నా చేసి, కలెక్టర్ పమేలాసత్పతికి వినతిపత్రం ఇచ్చారు.  జిల్లా వ్యాప్తంగా జీపీల్లో పనిచేస్తున్న  కార్మికులకు  3 నెలల నుంచి 12 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.  

వెంటనే జీతాలు ఇప్పించాలని డిమాండ్  చేశారు.  ఉద్యోగ భద్రత, పీఎఫ్​, ఈఎస్ఐ, రూ.10లక్షల ప్రమాదభీమాతో పాటు వారంతపు సెలవులు ఇప్పించాలన్నారు. లేకుంటే సమ్మె పోరాటం  చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు లు రాచర్ల మల్లేశం, కోశాధికారి ఇండికా రవీందర్రావు,  శంకర్, మహిపాల్,  ప్రేమ్ కుమార్, సారయ్య, వడ్లూరి లక్ష్మీనారాయణ, చంద్రయ్య లక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.