యాదగిరిగుట్ట లాడ్జీల్లో తనిఖీలు : సీఐ రమేశ్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని పలు ప్రైవేటు లాడ్జీల్లో సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో రిజిస్టర్లు, సీసీ కెమెరాలు మెయింటైన్ చేస్తున్నారా? లేదా? అని చెక్ చేశారు. అద్దెకు రూమ్ లు తీసుకున్న వ్యక్తుల ఆధార్ వివరాల నమోదు చేసే రిజిస్టర్లను పరిశీలించారు. రూల్స్​ బ్రేక్ చేస్తే లాడ్జీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు అద్దెకు ఇవ్వొద్దని ఆదేశించారు.

యాదగిరిగుట్ట ఆలయ పవిత్రతను కాపాడడం అందరి కర్తవ్యమని, ఇందుకు లాడ్జీల నిర్వాహకులు కూడా సహకరించాలన్నారు. తనిఖీల్లో ఎస్సై అనిల్ కుమార్, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.