Christmas 2024: క్రిస్మస్ చెట్లు.. ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్ఠత.. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చెట్లు ఎందుకు..!

క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. మిగతా పండుగలకన్నా క్రిస్మస్ కాస్త ప్రత్యేకం. ఎందుకంటే క్రిస్మస్ వేడుకలను కచ్చితంగా ఇలానే జరుపుకోవాలనే నియమాలేమీ ఉండవు. కొన్ని దేశాల్లో క్రిస్మస్కు  పదిపదిహేను రోజుల ముందు నుంచే వేడుకలు మొదలైతే, కొన్ని దేశాలు పండుగ తర్వాత కూడా అందరిలో ఆ ఆనందాల్ని నింపుతాయి. ఈ పండుగలో ప్రధానంగా కనిపించేది క్రిస్మస్ ట్రీ. ప్రతీ ఇంట్లో క్రిస్మస్ ట్రీని రకరకాలుగా అలంకరించి, దీపాల వెలుగులతో నింపేస్తుంటారు. అయితే క్రిస్మస్ ట్రీ అన్నిచోట్ల ఒకేలా ఉండదు. ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకతతో ఉంటుంది. అంతేకాదు, కొన్ని దేశాల్లో ట్రీ తోపాటు క్రిస్మస్ జరుపుకునే విధానం కూడా వేరేగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం...

* క్రిస్మస్ అమెరికాలో ముఖ్యమైన పండుగ.- రెండు వారాల ముందు నుంచే క్రిస్మస్ సందడి ప్రారంభమవుతుంది. అక్కడ క్రిస్మస్ ట్రీ అలంకరణకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. వాళ్లు ముఖ్యంగా పాప్ కార్న్ని క్రిస్మస్ ట్రీ అలంకరణకు వాడతారు. పూలమాల లాగా పాప్ కార్న్ని దారానికి అల్లి దానిని క్రిస్మస్ చెట్టుకి చుడతారు. ట్రీ చుట్టూ రంగు రంగుల లైట్లు అమర్చి వెలుగులతో మెరిసిపోయేలా తయారు చేస్తారు.

* జపాన్లో అయితే క్రిస్మస్కు హాలిడే కూడా ఉండదు. అయినా.. అక్కడివాళ్లందరు ఈ పండుగను ఎంతో సరదాగా జరుపుకుంటారు. వీళ్లు క్రిస్మ స్ ట్రీకి అలంకరణగా ఓరిగామి బర్డ్స్ ని వాడతారు. ఈ బర్డ్స్ ని  పేపర్తో తయారుచేస్తారు. బుల్లి పిట్టల్లాగా ఉండే ఈ బర్డ్స్ ని ఇంట్లోనే తయారు చేస్కోవచ్చు.

* ఉక్రెయిన్లో క్రిస్మస్ వేడుకల్లో అలంకరణ జోష్ బాగా ఉంటుంది. అవి అమెరికాలో జరుపుకునే హలోవీన్ అలంకరణకు దగ్గరగా ఉంటాయి. అంతేకాదు. క్రిస్మస్ ట్రీలను సాలెగూళ్లతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇవి మిగతా క్రిస్మస్ ట్రీస్ కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. సాలెగూళ్లతో అలంకరించే సంప్రదాయానికి అక్కడి జానపద కథ కారణమని చెబుతారు అక్కడివాళ్లు.

ALSO READ : Christmas 2024: క్రిస్మస్ బెల్స్.. గంటల విశిష్ఠత ఏంటీ.. చర్చిలో గంటలు ఎందుకు మోగిస్తారు..!

* ఐర్లాండ్లో  పిల్లలు క్రిస్మస్ను వేరే తీరులో జరుపుకుంటారు. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు తమ పడక గది కిటికీ పక్కన షూ పెట్టి నిద్రపోతారు. మర్నాడు ఆ ప్రదేశంలో వారికి ఒక క్రిస్మస్ గిఫ్ట్ ఉంటుందని నమ్ముతారు. ఆ గిఫ్ట్ సైజు అంతకుముందురోజు పిల్లల ప్రవర్తన బట్టి ఉంటుందట. ఇక్కడ క్రిస్మస్ ట్రీని 'ఉలే లాడ్స్' అనే క్రిస్మస్ తాత ఆకారంలో ఉండే బొమ్మలతో, గుంద్రటి బంతులతో అలంకరిస్తారు.

* ఇటలీలో శాంటాక్లాజ్ కోసం పిల్లలు ఎదురుచూడరు. దానికి బదులు జనవరి 5న 'లా బెఫానా', 'క్రిస్మస్ విచ్' రాక కోసం ఎదురుచూస్తారు. ఇక్కడ క్రిస్మస్ ట్రీని వాళ్లే తయారు చేసిన చిన్నచిన్న బొమ్మలు, క్రాఫ్ట్స్తో అలంకరిస్తారు.

* ఇక ఆస్ట్రేలియాలో సముద్రపు గవ్వలు, ఫ్రాన్స్లో ఫ్రూట్స్, జర్మనీలో కొవ్వొత్తులు, నెదర్లాండ్స్ బిస్కట్స్  ఇలా ప్రపంచ దేశాలన్నీ క్రిస్మస్ను తమ సంప్రదాయాలు, జీవనశైలికి అనుగుణంగా రకరకాలుగా జరుపుకుంటాయి. ఇక్కడ కూడా కూడా క్యాండీ స్టిక్స్, స్టార్స్, చాక్లెట్స్, కలర్ రిబ్బన్స్ ఉపయోగించి క్రిస్మస్ ట్రీసు రకరకాలుగా అలంకరించుకోవచ్చు.