Theatre Releases: క్రిస్మస్కు తెలుగు సినిమాల పండుగ.. బరిలో దిగనున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి!

పండుగ వస్తుందంటే చాలు సినిమాల జాతర మొదలైనట్టే. తెలుగు సినీ ప్రేక్షకులు రాబోయే పండుగకు థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది దసరా బరిలో ఓ మోస్తారు సినిమాలొచ్చి.. బాక్సాఫీస్ ముందు తేలిపోయాయి. ఇక దీపావళికి వచ్చిన సినిమాలైతే బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేసేలా భారీ సక్సెస్ను రుచిచూశాయి.

క, లక్కీ భాస్కర్, అమరన్ విభిన్నమైన కాన్సెప్ట్స్ తో వచ్చి ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే క్రిస్మస్కు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అనే ఎదురుచూపులో ఉన్నారు తెలుగు ఆడియన్స్. మరి థియేటర్ ఆడియన్స్ను పలకరించే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

రాబిన్ హుడ్ (Robinhood):

నితిన్ హీరోగా వెంకీ కుడుముల(Venkykudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నితిన్ కి జోడీగా యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. 

బచ్చల మల్లి (Bachchala Malli):

హీరో అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విలేజ్ డ్రామాగా నైంటీస్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ  చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సారంగపాణి జాతకం (Sarangapani Jathakam):

ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం'. జీవితం మొత్తం మన చేతిలోనే రాసుంటుంది’ అని జాతకాలను గుడ్డిగా నమ్మే సారంగపాణి జీవితంలో.. ఆ అతి నమ్మకం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. కాగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది.

భైరవం (Bhairavam):

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం‘భైరవం’ (Bhairavam). పెన్ స్టూడియోస్‌‌  డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌‌ పతాకంపై కెకె రాధామోహన్‌‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2):

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో జాతీయ అవార్డు విన్నర్ వెట్రిమారన్ (Vetrimaran) డైరెక్ట్ చేస్తున్న ‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2) ఒకటి. సూరి మరో లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌ చేస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్గా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో క్రిస్మస్ కానుకగా గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైంది. 

అయితే, ఈ సినిమాలన్నీ క్రిస్మస్ డేట్స్ను లాక్ చేసుకున్నాయి. దాంతో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. వేచిచూడాలి క్రిస్మస్ ఎలా ఉండనుందో!