చొప్పదండి ఎమ్మెల్యే భార్య సూసైడ్

 హైదరాబాద్, వెలుగు : చొప్పదండి కాంగ్రెస్​ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్​లోని పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం అర్ధరాత్రి  ఉరివేసుకున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే సత్యం దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రూపాదేవి ఓ స్కూలులో టీచర్​గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.