కొడిమ్యాల/గంగాధర/మల్యాల/బోయినిపల్లి, వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బర్త్‌డే వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్ లీడర్లు ఘనంగా నిర్వహించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఎంపీపీ స్వర్ణలత, ప్యాక్స్ చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. లీడర్లు ఏలేటి కమలాకర్ రెడ్డి, సింధు మహేశ్, గోల్కొండ రాజు, మాజీ సర్పంచ్ మ్యాకల లత మల్లేశం పాల్గొన్నారు.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా, క్యాంపు ఆఫీస్, రామడుగు మండలకేంద్రాల్లో బర్త్ డే వేడుకలు నిర్వహించారు. మల్యాల, బోయినిపల్లి మండలాల్లోనూ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, లీడర్లు లక్ష్మీపతి గౌడ్, కనుకయ్య, పాల్గొన్నారు.