కొడుకు పట్టించుకుంట లేడని సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వృద్ధురాలి ఫిర్యాదు

  • సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వృద్ధురాలి ఫిర్యాదు 

మెట్ పల్లి, వెలుగు: వృద్ధాప్యంలో కన్న కొడుకు పట్టించుకోవడం లేదని,  హాస్పిటల్ ఖర్చుల కోసం  నెలనెలా కొంత డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని మల్లాపూర్ మండలం చిట్టపూర్ గ్రామానికి చెందిన ఏనుగు రాజు తెలిపింది. మంగళవారం ఆమె మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులను కలిసి వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన  కొడుకు ఏనుగు మోహన్ రెడ్డి తన బాగోగులు చూడకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అనారోగ్యంతో ఉన్న తన భర్త రాజగంగారం ట్రీట్మెంట్ కోసం డబ్బు ఇవ్వడం లేదని ఆరోపించింది.

ఈ విషయమై జులై 7 న ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా తన కొడుకును ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించి విచారణ అనంతరం ప్రతి నెలా రూ.5 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయినా ఇప్పటివరకు డబ్బు చెల్లించడం లేదని అధికారులను ఫిర్యాదు చేసింది.