చిన్నోనిపల్లి​లో భయం భయంగా బతకాల్సిందేనా?

  • ఏండ్లుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్  పనులు పెండింగ్
  • ఊరు ఖాళీ చేయని నిర్వాసితులు
  • వానలతో రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు
  • ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు లేక తిప్పలు

గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్​లో భాగంగా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్  నిర్మిస్తున్నారు. రిజర్వాయర్  పనులు కంప్లీట్  కాకపోవడం, ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు లేకపోవడంతో చిన్నోనిపల్లి గ్రామస్తులు ఊరిని ఖాళీ చేయలేదు. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు కురుస్తున్న వానలకు రిజర్వాయర్ లోకి నీళ్లు చేరుతుండడంతో వారు భయం భయంగా కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఊరి నుంచి పోదామంటే అక్కడ సౌలతులు లేవు. ఊళ్లోనే ఉందామంటే ముంపు భయం. కొన్నేండ్ల కింద ఇచ్చిన పరిహారం అంతా అయిపోయిందని, ఇప్పుడు ఇండ్లు కట్టుకునేందుకు చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు.

దంచి కొడుతున్న వానలతో ఆందోళన..

నిర్వాసితులను వానలు భయపెడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ వానలు పడుతున్నాయి. ఒక్కసారిగా రిజర్వాయర్ లో నీటిమట్టం పెరిగితే నిర్వాసితులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. ఇటీవల రెవెన్యూ, ఇరిగేషన్  ఆఫీసర్లు రిజర్వాయర్ లో నీటిని నిల్వ ఉంచబోమని చెప్పినప్పటికీ.. ఆ దిశగా పనులు చేయకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల కింద భారీ వర్షాలు పడ్డాయి. వాటితో రిజర్వాయర్ లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికైనా ఆఫీసర్లు రిజర్వాయర్​లో నీరు నిలువ ఉంచకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు కోసం అప్పట్లో దీక్షలు..

నెట్టెంపాడులో భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని నిర్వాసితులు 373 రోజుల పాటు దీక్షలు చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్​ సర్కార్​ రిజర్వాయర్ పనులు చేసేందుకు ప్రయత్నం చేసింది. నిర్వాసితులు అడ్డుకోవడంతో ఆందోళనకారులను అరెస్ట్​ చేసి బలవంతంగా పనులు చేశారు. మళ్లీ కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. కట్ట పనులు చివరి దశలో ఉన్నాయి. చిన్నోనిపల్లి నిర్వాసితుల దీక్షలకు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇప్పుడు కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో ఉన్నారు.

12 ఏండ్లుగా పోరాటం..

జోగులాంబ గద్వాల జిల్లాలో భూములకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా ఎకరా లక్షల్లో పలుకుతోంది. చిన్నోనిపల్లి రిజర్వాయర్ కు ఎలాంటి ఆయకట్టును ప్రతిపాదించకపోవడం, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం, అప్పట్లో ఎకరాకు రూ.75 వేలు మాత్రమే ఇవ్వడంతో  రైతులు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. రిజర్వాయర్ ను రద్దు చేసి తమ భూములు తమకు ఇవ్వాలని రైతులు, నిర్వాసితులు 12 ఏండ్లుగా డిమాండ్  చేస్తున్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోసం ప్రభుత్వం 2005లో సర్వే చేసి 2006లో భూసేకరణ చేపట్టింది.

గట్టు మండలంలోని చిన్నోనిపల్లి, చాగదోన, బోయలగూడెం, ఇందువాసి, లింగాపురం గ్రామాల్లోని రైతుల నుంచి 2,650 ఎకరాలను సేకరించారు. ఇందుకుగాను అప్పట్లో ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇచ్చారు. అనంతరం పనులు ప్రారంభించినా మధ్యలోనే  వదిలేశారు. దీంతో రైతులు తమ భూములను ఎప్పటిలాగే సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూముల కోసమే వారు పోరాటం చేస్తున్నారు.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ పట్టించుకోలే..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నోనిపల్లి గ్రామంలోని 250 ఇండ్లు ముంపునకు గురవుతుండగా.. ఆఫీసర్లు తొలి విడత పరిహారం అందించారు.  నిర్వాసితుల కోసం అంతంపల్లి దగ్గర ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకరణ చేశారు.  ప్లాట్లు కేటాయించి వాటర్ ట్యాంక్,  డ్రైనేజీ కట్టి  వదిలిపెట్టారు. ప్రస్తుతం వాటర్  ట్యాంకు కూలిపోయే దశకు చేరుకున్నది. స్కూల్  నిర్మాణం పిల్లర్ల దశ కూడా దాటలేదు. బోర్లన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ ఏ పని చేసుకోలేని పరిస్థితి ఉంది. సౌలతులు కల్పించకపోవడంతో నిర్వాసితులు అక్కడికి వెళ్లకుండా పాత గ్రామంలోనే ఉంటున్నారు.

ఏండ్లుగా పనులు పెండింగ్..

2006లో భూసేకరణ కంప్లీట్​ అయినప్పటికీ చిన్నోపల్లి రిజర్వాయర్​ను గత ప్రభుత్వాలతో పాటు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు కూడా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హడావుడి చేశారు. గత ఏడాది జనవరి 28న చిన్నోనిపల్లిపై ఆరా తీసేందుకు అప్పటి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ  స్మితా సబర్వాల్ ను పంపించారు. 40 రోజుల్లో రిజర్వాయర్  పనులు కంప్లీట్ చేయాలని, ప్రతిరోజు పనుల ఫొటోలు అప్​లోడ్ చేయాలని ఆమె ఇరిగేషన్  ఇంజనీర్లను ఆదేశించారు. వెంటనే గ్రామానికి కరెంట్  కట్  చేసి, వాటర్  సప్లై బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి  పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేయాలన్నారు. జనవరి 30న మెషీన్లు తీసుకెళ్లి పనులు చేసేందుకు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు.

13 ఇండ్లకు పరిహారం ఇయ్యలే..

రిజర్వాయర్  నిర్మాణం జరిగేటప్పుడు 250 ఇండ్లు చిన్నోనిపల్లిలో ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. వాస్తవంగా గతంలోనే అన్ని ఇండ్లకు పరిహారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇంకా 13 ఇండ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా 360 ప్లాట్లు ఆర్అండ్ఆర్  సెంటర్ లో ఇవ్వాల్సి ఉండగా, 250 మందికి మాత్రమే ఇచ్చారు. మరో100 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ పెండింగ్ లో పెట్టి రిజర్వాయర్  పనులు కంప్లీట్ చేస్తామని, తమను ఆర్అండ్ఆర్ సెంటర్​కు వెళ్లాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆయకట్టు లేని రిజర్వాయర్ ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

న్యాయం జరిగే వరకు పోరాడుతాం..

మాలో కొందరికి ఇప్పటి వరకు పరిహారం రాలేదు. అయినప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత బీఆర్ఎస్  గవర్నమెంట్  తీవ్రంగా ఇబ్బంది పెట్టినా మేం బెదరలేదు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అందరికీ పరిహారం ఇచ్చాక కొంత టైం ఇవ్వాలి. లేదంటే రిజర్వాయర్ ను రద్దు చేయాలి.

నర్సింలు గౌడ్, నిర్వాసితుడు, చిన్నోనిపల్లి

సమస్యను పరిష్కరిస్తాం..

నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం. ఎన్నికలు ఉండడం వల్ల ఆర్అండ్ఆర్  సెంటర్ పై ఫోకస్ పెట్టలేదు. నిర్వాసితులతో మాట్లాడి వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.

రాంచందర్, ఆర్డీవో, గద్వాల