చంద్రుడిపై వాల్కెనో ఆనవాళ్లు నిజమే.. చైనీస్ స్పేస్ క్రాఫ్ట్ శాంపిల్స్ తో తేలింది..

చంద్ర గ్రహాంపై మానవ నివాసానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా అన్న కోణంలో చాలా కాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా చంద్రుడిపై  చైనీస్ స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన శాంపిల్స్ ద్వారా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. చైనీస్ స్పేస్ క్రాఫ్ట్ చేంజ్ 6 సేకరించిన శాంపిల్స్ లో చంద్రుడిపై వాల్కేనో ఆనవాళ్లు ఉన్నాయని తేలింది.

చంద్ర గ్రహంపై 1.4 బిలియన్ సంవత్సరాల కిందట అగ్నిపర్వత ఆనవాళ్లు చేంజ్ 6 స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన శాంపిల్స్ తో రుజువైంది. ఈ శాంపిల్స్ లో  వివిధ అగ్నిపర్వత శిల శకలాలు ఉన్నాయని.. పరిశోధకులు స్పష్టం చేశారు. రేడియో ఐసోటోప్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగించి వాటి వయసు నిర్దారించారు పరిశోధకులు.