పులిహోర కలపండి.. బోనస్ పొందండి: ఉద్యోగులకు కంపెనీ బంఫరాఫర్

"తోడు వెతుక్కొని ఎంజాయ్ చేయండి.. బోనస్ రుపంలో నగదు రివార్డు ఇస్తాం.." ఈమాత్రం ఆఫర్ మీకిచ్చి ఉంటే, చెలరేగి పోయేవారు కదా..! రోజుకు ఓ పది మందిని లైన్‌లో పెట్టి.. నెల ముగిసే నాటికి లక్షో.. లక్షన్నర జీతం అందుకునేవారు. ఇలా చేస్తారనే మీకివ్వలే.

సంస్థ ఒంటరి ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపడానికి ఓ చైనా కంపెనీ ఈ వినూత్న ఆఫర్ ప్రవేశ పెట్టింది. కంపెనీ ఒంటరి ఉద్యోగులు ఎవరైనా తోడు వెతుక్కొని ఎంజాయ్ చేస్తే.. బోనస్ రుపంలో నగదు ప్రోత్సహకాలు ఇస్తామని ప్రకటిచింది. అందునా, కంపెనీయే అంతర్గత డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. 

ఈ ఆఫర్ ప్రకటించిన కంపెనీ పేరు.. Insta360(కెమెరా కంపెనీ). దీని ప్రధాన కార్యాలయం షెన్‌జెన్‌ నగరంలో ఉంది. ఈ కంపెనీ ఒంటరి ఉద్యోగులు ఎవరైనా డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లో బయటి వ్యక్తిని పరిచయం చేసుకొని.. వారితో సంభాషించే ప్రతి పోస్ట్‌కు 66 యువాన్లు(సుమారు రూ. 750) అందుకోవచ్చు. అదే పరిచయమైన వారితో కనీసం మూడు నెలల పాటు తమ బంధాన్ని కొనసాగిస్తే.. ఉద్యోగి, బయట వ్యక్తి ఇద్దరూ 1,000 యువాన్లు(రూ.11,300) చొప్పున బోనస్ అందుకుంటారు.

ALSO READ | పిల్లల్ని ఆడించడానికేనా ఇంత చదివింది.. అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఘోరం

సంస్థ ఒంటరి ఉద్యోగుల్లో ఆనందాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ 11 నాటికి కంపెనీ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 500 పోస్ట్‌లు షేర్ చేయబడ్డాయి. అందుకుగానూ, కంపెనీ ఇప్పటివరకూ దాదాపు 10,000 యువాన్లు (సుమారు రూ. 1,16,576) నగదు రివార్డు పంపిణీ చేసింది. మూడు నెలల గడువు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇవ్వాల్సిన బోనస్‌లు పెండింగ్‌లో పెట్టింది.