6జీ రేసులో చైనా దూకుడు

  • స్టార్ లింక్ ను వెనక్కి నెట్టి.. సెకనుకు 100 గిగాబిట్స్ డేటా ట్రాన్స్ మిట్ చేసిన డ్రాగన్

బీజింగ్: డేటాను ట్రాన్స్ మిట్ చేయడంలో చైనా భారీ విజయం సాధించింది. ఆ దేశానికి చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ కంపెనీ సెకనుకు100 గిగాబిట్స్ డేటాను ట్రాన్స్ మిట్ చేసేలా అత్యాధునిక స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 

జిలిన్–1 శ్రేణిలోని శాటిలైట్లు ట్రక్ పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్ కు ఈ డేటాను పంపించాయి. ఈ డేటా గతంలో ఉన్న రికార్డు కంటే దాదాపు10 రెట్ల వేగంతో ప్రయాణించిందని తెలిపింది. ఆ సంస్థ లేజర్‌‌ కమ్యూనికేషన్స్‌‌ గ్రౌండ్‌‌ స్టేషన్ టెక్నాలజీ హెడ్ వాంగ్‌‌ హాంగ్‌‌ హాంగ్‌‌ మాట్లాడుతూ.. స్టార్‌‌లింక్ 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందన్నది అధికారికం కాదని తెలిపారు. తమ టెక్నాలజీ మస్క్‌‌కు చెందిన స్టార్ లింక్ కంపెనీని ఈ విషయంలో వెనకడుగు వేసేలా చేసిందన్నారు.