ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!

జనాభా ఎక్కువగా ఉన్న చోట.. కనీస వసతుల్ని కల్పిం చడం కూడా కష్టంగా మారుతోంది. అయితే ఆ ఊళ్లో మాత్రం అంతా ధనికులే.. ఎటు చూసినా ఆర్భాటాలే!. కుటుంబంలో ఒక్కరికైనా కోటి రూపాయలకు తక్కువ కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందంటే ఆశ్చర్య పోవాల్సిందే. 

పొరుగు దేశం చైనాలో ఉన్న ఆ ఊరి పేరు హువాక్సి. నెంబర్ వన్ విలేజ్ అండర్ ది స్కై గా వరల్డ్ దీనికి ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. చైనాకి తూర్పుదిశగా జియాంగ్సు ప్రావిన్స్ లో ఉంది హువాక్సి. కమ్యూనిస్ట్ పార్టీ నేత పూ రెమ్బావో ఈ సోషలిస్ట్ విలేజ్ ను తీర్చిదిద్దినట్లుచెప్తుంటారు. ఈ ఊరి గురించి 1961లో తొలిసారి మీడియాలో కథనం వచ్చింది. సుమారు 240 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ఊరు. 

Also Read :- బరువులు ఎత్తండి.. ఎక్కువకాలం బతకండి

రెండువేల మంది జనాభా ఉన్న హువాక్స్ చైనాలోనే అత్యంత రిచ్చెస్ట్ విలేజ్.... ఎంత రిచ్ అంటే ఉళ్లో తిరగాలన్నా.. బయట ఊళ్లకు వెళ్లాలన్నా హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. ఆఖరికి ట్యాక్సీలు కూడా హెలికాప్టర్లే ఉంటాయి. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఇక్కడ. కాకపోతే ఉద్యోగాల కోసం వచ్చిన నాన్ లోకల్స్ కి (ఇరవై వేల మంది పైనే ఉన్నారు) ఆ అవకాశం ఉండదు.
అంతేకాదు ఇక్కడున్న వాళ్లు బయటి ఊళ్లకు వెళ్లాలనుకుంటే ఆస్తులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్లాలన్న రూల్ కూడా ఉందట. అప్పుడు ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపర్చుకుని, మెయింటెయిన్ చేస్తుంది. హైటెక్ హంగులతో ఉండే ఈ గ్రామంలో డెబ్బై అంతస్తుల సూపర్ టవర్ ఓ ప్రత్యేక ఆకర్షణ.

–వెలుగు, లైఫ్​‌‌‌‌–