అత్యంత వేగంతో నడిచే రైలును చైనాలో అధికారులు పరీక్షించారు. CR450 రైలు .. గంటకు 453 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లుందని వివరించారు. బీజింగ్ నుంచి షాంఘైకి వెళ్లేందుకు నాలుగు గంటలు సమయం పడుతుండగా ఈ ట్రైన్ లో కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని .. ఇంజిన్ పరీక్షలో తేలిందని రైల్వే ఆపరేటర్ తెలిపారు. ఈ రైలును ఆదివారం ( డిసెంబర్ 29) బీజింగ్ లో అధికారులు పరీక్షించారు.
సీఆర్ 450 ను వాణిజ్య రైలుగా కీలక పాత్ర పోషిస్తుందని .. వ్యాపార రంగంలో దీనిని ఉపయోగించే విషయంలో నిర్ధారించడానికి దాని సాంకేతిక సూచికలను ఆప్టిమైజ్ చేస్తుంది. ప్రస్తుతం అత్యంత వేగంగా నడుస్తున్న సీఆర్400 మోడల్ కంటే ట్రైన్ కంటే ..సీఆర్ 450 ట్రైన్ కు 20 శాతం విద్యుత్ వినియోగం తక్కువుగా ఉంటుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.CR450 పరీక్షలలో రైలు సాంకేతికతలో చైనా అత్యాధునిక పురోగతిని హైలైట్ చేసిందని రైల్వే గ్రూప్ కో లిమిటెడ్ (చైనా రైల్వే) తెలిపింది. చైనా రైల్వే ప్రోటోటైప్ కోసం లైన్ పరీక్షల శ్రేణిని ఏర్పాటు చేస్తుంది .

I saw the video days before, but I’ve been waiting for the official news!???

The world’s fastest and China’s next-generation high-speed train CR450 is officially unveiled in Beijing.

With a test speed of 450km/h, the train will operate at speeds of 400km/h, 50 km/h faster… pic.twitter.com/E2t7iKvcaa
— Li Zexin (@XH_Lee23) December 29, 2024

చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అత్యంత స్పీడుగా .. మెరుపు వేగంతో దూసుకెళ్తుంది. CR450 రైలు వేగం, సస్పెన్షన్ నిర్దేశిత ప్రమాణాలను అనుగుణంగా ఉన్నాయని చైనా రైల్వే అధికారులు తెలిపారు. . గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లక్ష్యంతో చేపట్టిన రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలవనుంది.