బాలల దినోత్సవాన్ని 'బాల్ దివాస్' అని కూడా పిలుస్తారు. దీన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14 న జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని స్మరించుకుంటుంది. అతను చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందాడు. నెహ్రూ బాలల హక్కులు, విద్య కోసం ఎంతో కృషి చేశారు. పిల్లలకు విద్య అవసరం అనే అతని ఆలోచన దేశం అభివృద్ధి చెందడానికి కీలకంగా మారింది.
దేశం భవిష్యత్తు, సమాజానికి పునాదిగా పిల్లల ప్రాముఖ్యతను నెహ్రూ ప్రచారం చేశారు. ఆయన భారతీయ పిల్లలకు ప్రాతినిధ్యం వహించడానికి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియాను కూడా స్థాపించారు.
చరిత్ర
1948లో నవంబర్ 5న భారతదేశం తొలిసారిగా 'ఫ్లవర్ డే'ని జరుపుకుంది. 'ఫ్లవర్ టోకెన్ల' విక్రయం ద్వారా పిల్లల కోసం ఐక్యరాజ్యసమితి అప్పీల్ (UNAC) కోసం నిధులను సేకరించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) చేసిన ప్రయత్నమే ఈ చొరవ. అయితే 1954లో నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకున్నారు.
ప్రారంభంలో, భారతదేశంలో నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే, 1964లో నెహ్రూ మరణానంతరం, భారత పార్లమెంటు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ఆయన జన్మదినాన్ని భారతదేశంలో బాలల దినోత్సవం లేదా 'బాల్ దివాస్'గా ప్రకటించారు.
ప్రాముఖ్యత
బాలల దినోత్సవం పిల్లల విద్య, హక్కులు, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ, పరిశుభ్రత ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. పిల్లలే భారతదేశ భవిష్యత్తు. వారు దేశాన్ని ఎలా తీర్చిదిద్దగలరనే మాజీ ప్రధానమంత్రి దార్శనికతను పునరుద్ఘాటించే రోజు కూడా.
వేడుకలు
ఈ రోజు పిల్లలను పాంపరింగ్ చేయడానికి, వారికి బహుమతులు ఇవ్వాలని పిలుస్తుంది. భారతదేశంలోని పాఠశాలలు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. వివిధ పాఠశాలల్లో క్విజ్, వివిధ పోటీలు, డిబేట్లు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు.. బహుమతులు, కార్డులను మార్చుకుంటారు. కానీ ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలోని విద్యార్థులు పాఠశాలల్లో ఎటువంటి వేడుకలను చేసుకోరు. ఎందుకంటే నగరం అంతటా కాలుష్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 18 వరకు పాఠశాలలను మూసివేసింది. ఈ రోజున, భారత రాష్ట్రపతి భారతదేశంలోని పిల్లల కోసం ప్రత్యేక సందేశాన్ని కూడా విడుదల చేస్తారు.