Children Special : మీ పిల్లలు చలాకీగా, ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి

పిల్లలకి ఆటల మీద ఉన్నంత ఇష్టం. వేరే దేని మీదా ఉండదు. స్కూల్లో.. అయితే ఇంటర్వెల్ బెల్ కొట్టడానికి అయిదు నిమిషాల ముందే బ్యాగ్ సర్దేసి.. బయటకు పరుగెత్తడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు బెల్ వినిపిస్తుందా? ఎప్పుడు బయటకి వెళ్లి ఆడుకోవాలా? అని తలుపు వైపు చూస్తుంటారు. స్కూల్లోనే కాదు, ఇంట్లోనూ రెగ్యులర్ ఏవో ఒక ఆటలు ఆడుకుంటూనే ఉంటారు. రోజూ ఆడే గేమ్స్ బోర్ కొట్టేశాయా? అయితే ఈ గేమ్స్ ఆడి చూడండి.

మంకీ వాక్..

ఈ గేమ్ లో ఆరు లేదా ఏడు పేపర్ గ్లాస్లు బోర్లించి వరుసగా పెట్టాలి. ఒక్కో గ్లాస్ మధ్య కొంత గ్యాప్ కూడా ఉండాలి. వాటికి ఒక చివర ఆటవస్తువులు ఉన్న బుట్ట పెట్టాలి. మరో చివర ఖాళీ బుట్ట పెట్టాలి. ఇందులో ఎంతమందైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ, ఆడేటప్పుడు ఒక్కొక్కళ్లే ఆడాలి. ఎలా ఆడాలంటే... మొదట ఆట వస్తువులు ఉన్న బుట్ట నుంచి స్టార్ట్ చేయాలి. బుట్టలో నుంచి రెండు చేతుల్లో రెండు వస్తువులు తీసుకుని, వరుసగా పెట్టిన గ్లాసులను తగలకుండా మంకీ వాక్ చేస్తూ చివరికి వచ్చి ఖాళీ బుట్టలో వేయాలి. మళ్లీ వస్తువుల కోసం వెళ్లేటప్పుడు మంకీ వాక్ చేస్తూ వెళ్లాలి. 

పెన్సిల్/బాల్ డ్రాప్..

ఈ గేమ్ లో ఆరు గ్లాస్ లు కింద పెట్టాలి. వాటి ముందు ఒక చిన్న స్టూల్ పెట్టాలి. ఆ స్టూల్ మీద నిలబడి ఒక్కో పెన్సిల్ లేదా బాల్ తీసుకుని, గ్లాస్ పై పడేయాలి. ఒక నిమిషంలో ఎన్ని పెన్సిల్స్ లేదా బాల్స్ గ్లాస్ లో వేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. ఈ గేమ్ ఎంతమందైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్లే విన్నర్.