పిల్లలకు వీళ్లు చాలా ఇంపార్టెంట్​: అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలు.. ఎందుకంటే ..

ఒకప్పుడు దాదాపు  ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అందువల్ల పెద్దవాళ్ల మధ్య చంటిబిడ్డలు పెరిగేవాళ్లు. కానీ రోజులు పూర్తిగా మారాయి. నగరాలు, సిటీల్లోనే కాదు... పల్లెల్లో కూడా చిన్న చిన్న ఫ్యామిలీలే ఉంటున్నాయి.. అందుకే చాలామంది పిల్లలకు అమ్మానాన్నలు తప్ప, తాత, నాయనమ్మ, అమ్మమ్మ లాంటి వాళ్లు కూడా దగ్గర కాలేకపోతున్నారు. కానీ పిల్లలకు పెద్దవాళ్ల ప్రేమ, అనుభవం ఎంతో అవసరం. వాళ్లతో ఆడే ఆటలు, మాట్లాడే మాటలు, గడిపే సమయం పిల్లల పెరుగుదలకు బాగా తోడ్పడతాయి.

అమ్మా నాన్నలు ఎవరైనా పిల్లలను ఎంతో ప్రేమగా .. .జాగ్రత్తగా పెంచుతారు, అలా పెరిగిన పిల్లలు ఆరోగ్యంగా  ఆనందంగా ఉంటారు. కానీ.. అమ్మానాన్నలతో పాటు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ప్రేమతో పెరిగిన పిల్లలు మరింత సంతోషంగా, చలాకీగా ఉంటారని ఇటీవల చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. ఎందుకంటే పిల్లలు అమ్మానాన్నల కంటే బామ్మ, తాతలతోనే మరింత ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు తమ అనుభవాలు, పాత విషయాలను చెప్తూ పిల్లల్లో జ్ఞానాన్నీ నింపుతారు. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్లతో పెద్దవాళ్లు ఎలాంటి పనులు చేయాలి? ఏవి చేస్తే వాళ్ల బంధం బలపడుతుంది? అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటివి తెలుసుకుందాం.

ALSO READ | Good Health: దీని దుంప తెగ.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

నేచర్ వాక్

వయసు మళ్లిన వాళ్లందరికి అనుభవపూర్వకంగా ఎంతో జ్ఞానం వస్తుంది. అన్ని విషయాలపై మంచి అవగాహన కూడా ఉంటుంది. ప్రకృతిపై ప్రేమతో పాటు దాన్ని ఎలా కాపాడుకోవాలనే సంగతి తెలుస్తుంది.  అందుకే నగరాలు, సిటీల్లో ఉండే పిల్లలను పెద్దవాళ్లు దగ్గర్లో ఉన్న పార్కు పచ్చదనం  ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లాలి. అక్కడున్న మొక్కలు, చెట్లు, క్రిమికీటకాల గురించి పిల్లలకు వివరించాలి. అప్పుడు నాలెడ్జ్ పాటు వాళ్లకు ప్రకృతిపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఇసుక, మట్టిలో వాళ్లను ఆడించాలి

సైకిల్​ నేర్పించడం

పిల్లలకు తాతయ్యలు సైకిల్ నేర్పించడం అన్నది  మంచి మెమరీ...  పిల్లలు పెద్దయ్యాక సైకిల్, బైక్, కారు.. ఇలా ఏది సడుపుతున్నా తాత నేర్చిన విష యాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాగే సైకిల్ నేర్పించే క్రమంలో పిల్లలు ఏ తప్పు చేసినా తాతలు చాలా నెమ్మదిగా, ఓర్పుగా వారిస్తారు. ప్రతి చిన్న విషయాన్నీ ప్రేమగా, క్షుణ్నంగా వివరిస్తారు. అలా తాతలు సైకిల్ బ్యాలెన్సింగ్ తోనే లైఫ్ బ్యాలెన్సింగ్ కు పునాదులు వేస్తారు

లైబ్రరీకి వెళ్లాలి

పిల్లలకు ఏ అలవాటైనా చిన్నప్పట్నించే అలవడుతుంది. అందులో పుస్తకాలు చదవడం ఒకటి .  ఈ కాలంలో పిల్లలతో పాటు అమ్మానా న్నలు కూడా ఇరవై నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల ముందే కూర్చుంటున్నారు. దానివల్ల ఈ తరం పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు పూర్తిగా లేకుండా పోతోంది. అలాంటప్పుడు ఇంట్లో అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఉన్నప్పుడు. పిల్లలను దగ్గర్లో ఉన్న లైబ్రరీకి తీసుకెళ్లాలి. పిల్లలకు లైబ్రరీలో పేరు ఎన్​ రోల్ చేసుకోవడం, పుస్తకాలను ఎంచుకోవడం  నేర్పించాలి. పిల్లలతో పాటు ఇంట్లో పెద్దలూ చదివితే ఆ పుస్తకా లు చదవడం వాళ్లకు త్వరగా అలవాటవుతుంది

మ్యూజియం టూర్​

ప్రతి ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాగే కళలు, సైన్స్ కి సంబంధించిన మ్యూజియాలు ఉంటాయి. అలాంటివి ఇంటి పక్కనే ఉన్నా, చాలామంది అక్కడికి తక్కువగా వెళ్తారు. ఈమధ్య చాలామంది అమ్మానాన్నలు హాలీడే వస్తే చాలు... పిల్లలను ఏ సినిమాకో, ఏ మాల్​కో తీసుకెళ్లాలని చూస్తున్నారు. అలాకాకుండా చరిత్రకు సాక్ష్యాలు గా నిలిచే ఎగ్జిబిషన్ మ్యూజియాలకు తీసుకెళ్లాలి. తాతయ్యలు, బామ్మలు పిల్లలను అక్కడకు తీసుకెళ్లి పాత విషయాలనే కొత్తగా, ఒక కథలా చెప్తేపిల్లలు ఆసక్తిగా వింటారు.

గార్డెనింగ్​లో భాగమవ్వాలి

ఇంట్లో పూలు, పండ్ల మొక్కలు పెంచడం ఒక ఆర్ట్. అలాగే దాన్ని పిల్లలకు నేర్పించడం కూడా పెద్ద కళే అమ్మమ్మలు, తాతలు పిల్లలకు విత్తనాలు ఎలా వేయాలి? మొక్కలు ఎలా నాటాలి?.. ఎరువులు ఎందుకు వేయాలి? వంటి విషయాలను నేర్పించాలి. దానివల్ల పిల్లల్లో గ్రీనరీ, గార్డెనింగ్ పై ఆసక్తి పెరుగుతుంది. మట్టి, సూర్యరశ్మితో మంచి బంధం ఏర్పడుతుంది.

–వెలుగు.. లైఫ్​–