అదుపుతప్పి గోడను ఢీకొన్న స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మండలం చిల్లేపల్లిలోని హైదారాబాద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ బస్సు అదుపుతప్పి గోడను ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను అవంతిపురం గుడికి తీసుకువెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుంటున్నారు.