దేశంలో ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోల్చకూడదు:సుప్రీంకోర్టు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ తో పోల్చకూడదని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ తో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఓ కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.కర్ణాటక హైకోర్టు జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశనాంద బహిరంగా క్షమాపణలు చెప్పడంతో విచార ణను మూసేవేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.   

ఇటీవల కర్ణాటక హైకోర్టులో ఓ భూవివాదం కేసులో జస్టిస్ వేదవ్యాసాచార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూస్వామి కౌలుదారు వివాదాన్ని ప్రస్తావిస్తూ బెంగళూరు లోని ఓ ప్రాంతాన్ని పాకిస్తాన్ తో పోల్చారు. దీంతోపాటు ఆ కేసు వాదించిన మహిళా న్యాయవాదిపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 

Also Read :- రోజూ 3 కప్పుల బ్లాక్ కాఫీ.. షుగర్ కంట్రోల్.. గుండె జబ్బులకు చెక్..!

దీంతో ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి.. తక్షణమే కర్ణాటక హైకోర్టు నుంచి నివేదిక కోరింది. అయితే కర్ణాటక హైకోర్టు జస్టిస్ బహిరంగా క్షమాపణలు చెప్పడంతో సుప్రీంకోర్టు విచారణను మూసివేస్తున్నట్లు తెలిపింది. 

సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ లు ఎస్ ఖన్నా, బీఆర్ గవాయ్, ఎస్ కాంత్, హెచ్ రాయ్ లతో కూడినఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్య లు చేసింది. కోర్టుల్లో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం వ్యక్తం చేశారు.