చెర్వుగట్టులో భక్తుల సందడి 

నార్కట్​పల్లి,వెలుగు : చెర్వుగట్టు ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొన్నది. కార్తీక సోమవారం కావడంతో భక్తులు ఎక్కువగా  వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం ఓం నమశ్శివాయ నామస్మరణతో మార్మోగింది. భక్తులు ఉదయమే దర్శనం కోసం మండపంలో బారులు తీరారు.

స్వామి వారికి అభిషేకాలు చేసి,సత్యనారాయణ వ్రతాలు చేయించుకున్నారు. దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఆలయ ఈవో నవీన్, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.