- శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తం
- దీనిపై అసెంబ్లీ సెషన్లో మాట్లాడుతా..
- అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్త
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
కోల్‌బెల్ట్: లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ తెలంగాణ మాదిగ చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వివేక్ వెంకటస్వా మిని కలిశారు. ఈ మేరకు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లెదర్పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. లెదర్ఇండస్ట్రీని రివైజ్చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇండస్ట్రీపై సమగ్ర విశ్లేషణ చేస్తామన్నారు. చైన్నై, కర్టాటక తదితర ప్రాంతాల్లో లెదర్పరిశ్రమను ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? ఎలాంటి పద్దతులతో చేస్తున్నారని క్షుణ్ణ్నంగా తెలుసుకుంటామని వారికి వివరించారు. అతితొందరలోనే ఆయా ప్రాంతాలను సందర్శిస్తామన్నారు. లెదర్ఇండస్ట్రీకి శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తామన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లెదర్ ఇండస్ట్రీపై అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడుతున్నట్లుగా వారి తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.
లెదర్పరిశ్రమపై ఆధారపడ్డ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్‌కు వినతి పత్రాన్ని అందించారు.