సింగరేణిపై కేంద్రం నిర్లక్ష్యం:వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

  • వేలం లేకుండానే సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలి: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను ఈ సంస్థకే కేటాయించాలని కోరారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, చెన్నూరు మండలాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు ఆయన మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండర్​ టేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సింగరేణి సంస్థకు నేరుగా బొగ్గు గనులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల బహిరంగ వేలంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రెగ్యులేషన్ చట్టం తీసుకొచ్చిందని, పార్లమెంటులో గనుల వేలం కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పటి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎంపీలు కేంద్రానికి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు.

అయితే, వేలం బిల్లు పాస్ అయ్యాక కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బొగ్గు గనులు కేటాయించిందని, కానీ, సింగరేణి సంస్థను మాత్రం విస్మరించిందన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే సింగరేణి ప్రాంత బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

చెన్నూరు నియోజకవర్గం పరిధిలో కొత్త బొగ్గు గనులు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ వల్ల నియోజకవర్గంలో పంటలు మునిగి రైతులు నష్టపోతున్నా.. గత బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తాను కొట్లాడానని గుర్తుచేశారు. 

సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే సింగరేణి ప్రాంత బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో కొత్త బొగ్గు గనులు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ వల్ల నియోజకవర్గంలో పంటలు మునిగి రైతులు నష్టపోతున్నా.. గత బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తాను కొట్లాడానని గుర్తుచేశారు. 

మిషన్ భగీరథ ఒక ఫెయిల్ ప్రాజెక్ట్..

మిషన్ భగీరథ పథకం ఒక ఫెయిల్ ప్రాజెక్ట్ అని, ఈ స్కీమ్ కింద ఎక్కడా తాగు నీరు సప్లై కావడం లేదని వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. కమీషన్లు దోచుకోవడానికి ఈ ప్రాజెక్టును కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చారని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి తీర్చేందుకు తాను 100 బోర్లు వేయించానన్నారు. చెన్నూరు టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి ఎద్దడిని తీర్చేందుకు కొత్త పైపులైన్ వేయాలని మున్సిపల్ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలిచ్చామని చెప్పారు. దీని కోసం ఎమ్మెల్యే స్పెషల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్స్ ఇస్తానన్నారు.

ఇప్పటికే వార్డుల్లో విశాక ట్రస్ట్ ద్వారా వేసిన బోర్లనే తాగు నీటి కోసం ఉపయోగిస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కొద్దిగా టైమ్ ఇవ్వాలని ఆయన కోరారు. పోడు భూముల వ్యవహారం రాష్ట్ర సమస్యగా సీఎం రేవంత్ రెడ్డి పరిగణించారని, పట్టాలు ఉన్న వాళ్లు సేద్యం చేసుకోవాలని సూచించారు. మిగిలిన వారికి పట్టాలిప్పించేందుకు సర్కార్ ఆలోచన చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, దుర్గం నరేశ్, స్థానిక కాంగ్రెస్ లీడర్లు, అధికారులు పాల్గొన్నారు.