నవంబర్ 23న సిరిసిల్లలో మాలల బహిరంగ సభ .. హాజరుకానున్న వివేక్ వెంకట స్వామి

  • సిరిసిల్ల టౌన్, వెలుగు: ఈనెల 23న మాలలు, ఉపకులాల బహిరంగ సభ సిరిసిల్ల నిర్వహించనున్నట్లు మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు రాగుల రాములు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు చెన్నూరు ఎమ్యెల్యే వివేక్ వెంకట స్వామి  హాజరుకానున్నట్లు చెప్పారు. మాలలను అన్ని రంగాల్లో అణచివేసేందుకే వర్గీకరణకు కుట్ర చేశారన్నారు. 

23న సిరిసిల్లలో జరిగే సభకు పెద్ద సంఖ్యలో మాలలు, ఉపకులాలు తరలివచ్చి సక్సెస్‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోశల చంద్రం, జిల్లా కన్వీనర్ వంకాయల భూమయ్య, లీడర్లు లింబాద్రి, సురేశ్‌‌‌‌, బాలమల్లు, రమేశ్‌‌‌‌,శివ, రంజయ్య, అశోక్ పాల్గొన్నారు.