చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి శంకుస్థాపన

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పర్యటించారు.  చెన్నూరు పుప్పాల హనుమాన్​ వీధిలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.  రూ, 2 కోట్లతో చేపట్టే సీపీ రోడ్, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.  చెన్నూరు మున్సిపాల్టీలో సీసీ రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉందంటూ...  ఎన్నికల సమయంలో  అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 

ALSO READ | కేసీఆర్‌‌‌‌ ముందు నిలబడ్తవా?..సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్‌‌‌‌

 ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు మున్సిపాల్టీలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామన్నారు.  చెన్నూరు మున్సిపాల్టీలో రోడ్లు సరిగా లేవని.. అస్థవ్యస్తంగా డ్రైనైజీ ఉందని .. మిషన్​ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు చెప్పారని ఎమ్మల్యే వివేవ్​ వెంకటస్వామి అన్నారు.   ఈ మూడు రంగాలను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు.   ఇప్పటికే చెన్నూరు ప్రజలకు తాగు నీరు అందించేందుకు అమృత్​ పథకం ద్వారా వాటర్​ ట్యాంక్​ లు నిర్మాణం చేపట్టామన్నారు.