పెద్దపల్లి ఎమ్మెల్యేకు  వివేక్​ వెంకటస్వామి పరామర్శ 

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును ఎలిగేడు మండలం శివపల్లిలోని ఆయన నివాసంలో గురువారం చెన్నూర్​ఎమ్మెల్యే డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. విజయ రమణారావు సతీమణి పావని తండ్రి మాధవరావు బుధవారం చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా విజయ రమణారావును వివేక్ పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు సజ్జద్, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సునీల్, సంతోష్, కొలిపాక సంపత్ ఉన్నారు.