చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసిన కేఎల్ఎన్ ప్రసాద్ 

కోదాడ, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని గురువారం హైదారాబాద్ లో కోదాడకు చెందిన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ర్ట కో–ఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.  వివేక్ వెంకటస్వామి గతంలో ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా ప్రసాద్ గుర్తుచేశారు. ఆయన భవిష్యత్​లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.