సేవ చేయడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి : వివేక్​ వెంకటస్వామి

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోదావరిఖని, వెలుగు : పేదలకు సేవ చేయడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం రాత్రి గోదావరిఖనిలో రామగుండం లయన్స్​ క్లబ్​ 53వ నూతన కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా  వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  రామగుండం లయన్స్​ 53  సంవత్సరాల క్రితం ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. 

రామగుండం లయన్స్​ క్లబ్​ కు తన  తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటు చేసిన వెంకట కళావతి ట్రస్ట్​ ద్వారా రూ.10 లక్షలు అందజేశానని, ఆ నిధులతో కృత్రిమ అవయవాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి సర్వీస్​ చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు.  ఎవరైనా తమ సంపాదనలో కనీసంగా రెండు శాతం డబ్బునైనా పేదలకు ఖర్చు చేసేలా ప్లాన్​ చేసుకోవాలని సూచించారు.  

అనంతరం  లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడిగా ఎన్నికైన  పి.మల్లికార్జున్​, కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి పాకాల గోవర్ధన్​ రెడ్డి తో లయన్స్​ క్లబ్​ ఇన్టలేషన్​ ఆఫీసర్​ సింహరాజు కోదండరామ్​ ప్రమాణ స్వీకారం చేయించారు.    ఈ కార్యక్రమంలో మేయర్​ అనిల్​ కుమార్​, లయన్స్​ క్లబ్​ ప్రతినిధులు డాక్టర్​ విజయ, బంక రామస్వామి, గుండా వీరేశం, తానిపర్తి విజయలక్ష్మి, ప్రమోద్​ కుమార్​ రెడ్డి, మీనేశ్​​ నారాయణ్​ ఠాండన్​, గంగాధర్​, తిలక్​ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. 

పెద్దెల్లి మధునమ్మకు నివాళి

టీపీసీసీ సెక్రెటరీ పెద్దెల్లి ప్రకాశ్​ తల్లి మధునమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, గోదావరిఖనిలో శుక్రవారం జరిగిన ఆమె దశదిన కార్యక్రమంలో చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పాల్గొని   నివాళులర్పించారు. పెద్దెల్లి ప్రకాశ్​తో పాటు 11వ డివిజన్​ కార్పొరేటర్​ పెద్దెల్లి తేజస్విని, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అలాగే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్​, మంత్రి శ్రీధర్​బాబు సోదరుడు శ్రీనుబాబు, ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ సతీమణి మనాలి ఠాకూర్​, కార్పొరేటర్లు పాల్గొన్నారు.