చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదానికి తెర..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది.  చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పదిన్నర సంవత్సరాల పాటుగా సాగుతున్న కేసులో తీర్పును వెలువరించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం. పౌరసత్వం కేసులో తప్పుడు ధృవపత్రాలతో కేసును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అందుకుగాను 30 లక్షల జరిమానా విధించింది. అందులో రూ. 25 లక్షలను ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు మొత్తం పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్ ను ఆదేశించింది హైకోర్టు. 2009లో తప్పుడు ధృవపత్రాలతో గెలిచినట్లుగా చెన్నమనేని రమేష్ పై ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆదిశ్రీనివాస్ కేసు వేసిన విషయం తెలిసిందే.