food packaging chemicals : తినేది ఆహారమా.. విషమా : ప్యాకేజ్ ఫుడ్ ద్వారా 3 వేల 600 విష రసాయనాలు శరీరంలోకి..

మనం తింటున్నది అన్నమా.. విషమా.. మనం తింటున్నది ఆహారమా విషమా.. ఇప్పుడు ఇదే సందేహాలు వస్తున్నాయి.. కంట్లో నలక పడితేనే విలవిలలాడిపోతాం.. అలాంటిది మన శరీరంలో ఏకంగా 3 వేల 600 రసాయనాలను హాయిగా.. టేస్టీగా.. శుభ్రంగా ఉందన్న భ్రమల్లో తినేస్తున్నాం.. భారతదేశంలోని 90 శాతం మంది శరీరాల్లో ఏకంగా విష రసాయనాలు ఉన్నాయి.. ఒకటీ అరా కాదు.. ఏకంగా 3 వేల 600 రసాయనాలు.. ఇంత విషయం మన శరీరంలోకి ఎలా వెళుతుంది అంటారా.. సింపుల్ ప్యాకింగ్ ఫుడ్.. ప్యాకేజీ ఫుడ్ వల్ల.. అవును.. దేశంలోని గల్లీ గల్లీలోని దుకాణంలోనూ ప్యాకేజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఈ ప్యాకేజ్ ఫుడ్ తయారీలోనే రసాయనాలు వాడతారు.. ఆ రసాయనాలను మనం ఇంట్లోకి తీసుకొచ్చుకుని.. చక్కగా వండుకుని తినేస్తున్నాం.. ఇలా అన్న మాట. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫుడ్ ప్యాకేజింగ్ (food packaging) లేదా తయారీలో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్‌పోజర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇందులో సుమారు 100 వరకు హానికరమైనవి(chemicals harmful) ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన బిర్గిట్‌ గుయెకా తెలిపారు. వీటిలో పీఎఫ్‌ఏఎస్‌, బిస్ఫెనాల్‌ ఎ లాంటి నిషేధిత జాబితాలో ఉన్న రసాయనాలు ఉన్నాయని తేలింది. బిర్గిట్ గీకే జ్యూరిచ్‌కు చెందిన NGO ఫుడ్ ప్యాకేజింగ్ ఫోరమ్ ఫౌండేషన్‌కు రీసెర్చ్ రైయిటర్. PFAS రసాయనాలకు అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. ఫుడ్ ఐటమ్స్ ప్యాకింగ్ లో ఎక్కువ సేపు ఉంచొద్దని, ప్యాకేజ్డ్‌ ఆహారాన్ని వేడి చేయోద్దని ప్రజలకు ఆమె సూచించారు.

ALSO READ : Kitchen Tips : వీటిని వండేట‌ప్పుడు.. వీటిని క‌ల‌పండి.. మరింత రుచిగా ఉంటాయి..

గతంలో సుమారు 14 వేల ఫుడ్‌ కాంటాక్ట్‌ కెమికల్స్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇవి వివిధ రకాల ప్యాకేజింగ్‌ పదార్థాలు, వంట పాత్రల నుంచి ఆహారంలో కలిసిపోయే లక్షణాలు ఉన్నవి. తాజాగా కనుగొన్న 3,600 రసాయనాలు ఫుడ్‌ ప్యాకేజింగ్‌ ద్వారానే శరీరంలోకి వెళ్లాయని ఇప్పుడు చేసిన అధ్యయనం తేల్చలేకపోయిందని ఇందుకు ఇతర కారణాలు ఉండొచ్చని గుయెకా అభిప్రాయపడ్డారు.