విద్యుత్ షాక్‎తో చిరుత మృతి.. మూడో కంటికి తెలియకుండా పూడ్చిపెట్టిన రైతు

అడవి పందుల నుండి పంట పొలాన్ని రక్షించుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. అయితే, కరెంట్ ఫెన్సింగ్‎కు తగిలి ఓ చిరుత మరణించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని హాజీపూర్ కట్టకింది తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ షాక్ గురై మరణించిన చిరుత పులిని రైతు గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు. మరోవైపు చిరుత జాడ కనిపించక రెండు రోజులుగా ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిరుత మరణించిన సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత పూడ్చిపెట్టిన చోటుకు చిరుకుని చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ | విజృంభిస్తున్న జ్వరాలు..కామారెడ్డి జిల్లాలో 60 డెంగ్యూ కేసులు.. నలుగురి మృతి