మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ కుటుంబానికి మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెక్కును అందజేశారు.  వర్ని పోలీస్ స్టేషన్లో పనిచేసిన టి. వెంకటేశ్ 2017 జూలై 28న మృతి చెందాడు.  పోలీస్ భద్రత స్కీం రూపంలో 1,88,345 రూపాయల చెక్కును ఆయన కుమారుడు టి. ఉమాకాంత్‌కు కల్మేశ్వర్ అందజేశారు.  కార్యక్రమంలో డీసీపీ కోటేశ్వరరావు, ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ బాషా తదితరులు పాల్గొన్నారు.