OTT MOVIES..కిరణ్​ని ఎందుకు చంపారు?

టైటిల్ : చావర్

కాస్ట్ : కుంచకో బోబన్, ఆంటోనీ వర్గీస్, 
జాయ్ మాథ్యూ, మనోజ్​, సజిన్ గోపు, 
అర్జున్ అశోకన్,  సంగీత మాధవన్ నాయర్
డైరెక్టర్ : టిను పప్పచ్చన్
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్​ఫాం : సోనీలివ్

అశోకన్ (కుంచకో బోబన్), ముస్తఫా, ఆసిఫ్, థామస్​ అనే నలుగురు పొలిటికల్​ గుండాలు. వాళ్లంతా ఓ హత్య కేసులో ఇరుక్కుని పరారీలో ఉంటారు. దానికి ముందు వాళ్లంతా కలిసి ఒక పార్టీ చేసుకుంటారు. అయితే, వాళ్లు తప్పించుకునే క్రమంలో జీప్​ సరిచేస్తుండగా అశోకన్​కి దెబ్బ తగులుతుంది. మెడికల్ స్టూడెంట్, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్​ కొడుకు అయిన అరుణ్​​ దగ్గరకి వెళ్లి, అశోకన్​కి ఫస్ట్​ ఎయిడ్​ చేయడానికి రమ్మని రిక్వెస్ట్​ చేస్తాడు ముస్తఫా.

​దాంతో​ తన ఫ్రెండ్​ సూరజ్​ బైక్​ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసే లొకేషన్​కి వెళ్తాడు​. ఫస్ట్ ఎయిడ్ చేయకముందే ‘ఈ గాయాలు చూస్తుంటే అనుమానంగా ఉంది. ఎలా తగిలాయి?’ అని అడుగుతాడు. వాళ్లు సరైన సమాధానం చెప్పరు. ఫస్ట్ ఎయిడ్ చేశాక నిన్ను వదిలేస్తామని ప్రామిస్ చేస్తారు. కానీ, వాళ్లతోనే ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత.. కొంతసేపటికి థామస్ తన దగ్గరున్న బాంబ్​ బావిలో పారేస్తుంటే... అది బావిలో పడి పేలుతుంది. దాంతో కొత్త సమస్యలు మొదలవుతాయి. ఏంటా సమస్యలు? వాటిని ఎలా ఎదుర్కొంటారు? కిరణ్​ హత్యకు గల కారణాలేంటి? పోలీసులు పట్టుకుంటారా? వంటివి తెరపై చూడాల్సిందే. 

నలభై ఏండ్ల బ్యాచిలర్​కు​ పెండ్లి!

టైటిల్ : పులి మడ
కాస్ట్ : జోజు జార్జ్, ఐశ్వర్య రాజేశ్, లిజోమోల్ జోస్, బాలచంద్ర మేనన్, జానీ ఆంటోనీ, చెంబన్ వినోద్ జోస్, అబూ సలీం, కృష్ణ ప్రభ
డైరెక్టర్ : ఎ.కె. సజన్
లాంగ్వేజ్ : మలయాళం, ప్లాట్​ఫాం : నెట్​ ఫ్లిక్స్

విన్సెంట్​ స్కరియ (జోజు జార్జ్) పోలీస్​. నలభై ఏండ్ల బ్యాచిలర్​. తన పాత ఇంట్లో ఉంటుంటాడు. అది వాళ్ల తాతముత్తాతల కాలం నాటి ఇల్లు. అది కొండపైన ఎక్కడో ఉంటుంది. ఆ ఇంటికి బాత్​రూమ్ కూడా ఉండదు. అయినాసరే అక్కడి నుంచి అతను ఇల్లు మారాలి అనుకోడు. దానికి కారణం విన్సెంట్ తండ్రి. ఆయనకు ఇంట్లో బాత్​రూమ్​ ఉండడం ఇష్టం లేకపోవడంతో వాళ్లు కట్టించుకోరు. ఆయన చనిపోయిన తర్వాత కూడా అలానే ఉంటుంటారు. సంప్రదాయాలకు విలువనిచ్చే విన్సెంట్.. హౌస్​ వైఫ్​గా ఉండే భార్య కావాలని కోరుకుంటాడు. ఆ ఇంట్లో విన్సెంట్​, వాళ్ల అమ్మ ఉంటుంటారు. తల్లికి మానసిక ఆరోగ్యం బాగుండదు. ఎన్నో ఏండ్లపాటు ట్రై చేయగా... చేయగా ఎలాగోలా విన్సెంట్​కి పెండ్లి ఫిక్స్ అవుతుంది. అయితే, ఇక్కడే ట్విస్ట్​! పెండ్లి రోజే పెండ్లి కూతురు... ఆమె ప్రియుడితో కలిసి పారిపోతుంది. పెండ్లి డ్రెస్​లోనే పెండ్లి కూతుర్ని వెతకడానికి బయలుదేరతాడు విన్సెంట్. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. సినిమా పూర్తిగా ఎంటర్​టైన్ చేస్తుంది. 

సూపర్​ హీరో టైమ్​ ట్రావెల్​ చేస్తే..

టైటిల్ : ది ఫ్లాష్​
 ఎజ్రా మిల్లర్, సాషా కాల్లె, మైఖేల్​ షాన్నన్, రాన్ లివింగ్​స్టన్, మారబెల్ వెర్దు, కీర్సె క్లెమెన్స్ 
డైరెక్టర్ : యాండీ ముషెట్టి
లాంగ్వేజ్ : ఇంగ్లిష్​, తెలుగు, హిందీ, తమిళం   
ప్లాట్​ఫాం : జియో సినిమా

బ్యారీ అలెన్ (ఎజ్రా మిల్లర్) క్రిమినల్​ ఫోరెన్సిక్​ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తుంటాడు. సూపర్​ హీరోగా ప్రజల్ని కూడా కాపాడుతుంటాడు. బ్యారీ తల్లి హత్య కేసులో తన తండ్రికి అకారణంగా శిక్ష పడుతుంది. దాంతో తనకు ఉన్న శక్తుల్ని వాడి, టైమ్​ ట్రావెల్​ ద్వారా తల్లిని చనిపోకుండా కాపాడాలి అనుకుంటాడు. ఆ విషయాన్ని బ్యాట్​మెన్ బ్రూస్​ వెయిన్​ (బెన్ ఆఫ్లెక్)కి చెప్తాడు. అయితే గతాన్ని మారిస్తే ఫ్యూచర్​లో ప్రాబ్లమ్​ అవుతుందని చెప్తాడు అతను. కానీ, బ్యారీ ఆ మాటలు వినకుండా టైమ్​ ట్రావెల్​ చేసి తల్లిని కాపాడుకుంటాడు. 

తిరిగి తన కాలానికి వస్తుండగా మధ్యలో ఒక వ్యక్తి అడ్డుకోవడంతో 2013లో ఆగిపోతాడు. అయితే, తను వచ్చింది తన ప్రపంచానికి కాదు.. మల్టీవర్స్​లో ఉన్న మరో భూగ్రహం మీదకి అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బ్యారీని అడ్డుకున్న వ్యక్తి ఎవరు? చివరికి కథ ఎలా ముగిసింది? అనేవి ‘ది ఫ్లాష్​’ చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన సూపర్​ హీరో సినిమాలు ఏవీ డిసప్పాయింట్​ చేయలేదు. అలాగే ఇది కూడా ఆడియెన్స్​ని ఆకట్టుకుంటుంది. సూపర్​ హీరో మూవీ లవర్స్​​కి ఇది బెస్ట్​ ఎక్స్​పీరియెన్స్ ఇస్తుంది.