టెక్నాలజీ : వాట్సాప్​లో కొత్త అప్​డేట్..చాట్​బాట్​కీ నేరుగా ఫోన్​ కాల్!

వాట్సాప్​లో ఇప్పటికే మెటా ఏఐ సేవలు ఉపయోగిస్తున్నారు చాలామంది. అయితే ఇప్పుడు మరో కొత్త అప్​డేట్ వచ్చేసింది. చాట్​జీపీటీ చాట్​బాట్​కు డైరెక్ట్​ కాల్​ చేసేందుకు ఒక ఫోన్​ నెంబర్​ని తీసుకొచ్చింది. అది యూఎస్​ నెంబర్​1‌‌‌‌‌‌‌‌–1800–242–8478. ఈ నెంబర్​కి ఉచితంగా కాల్​ చేయొచ్చు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్​ ఉంది. అదేంటంటే... ఈ నెంబర్ 24/7 అందుబాటులో ఉండదు. నెలకు15 నిమిషాలు అంటే.. పావుగంట మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే మనం కాల్​ చేసి ప్రశ్నలు అడగొచ్చు. కానీ, చాట్​బాట్ నుంచి కాల్స్ రావు.

ప్రశ్న అడిగిన తర్వాత అది మెసేజ్​ రూపంలో వస్తుంది. కానీ, చాట్ ప్రారంభించక ముందు మాత్రం ఎటువంటి మెసేజ్​లు మీకు రావు అని ఓపెన్​ ఏఐ సంస్థ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ యూఎస్, కెనడాలోని యూజర్ల కోసం కాలింగ్ సర్వీస్​ను అందిస్తోంది. అయినప్పటికీ భారత్​తో పాటు చాట్​జీపీటీ సపోర్ట్​ ఉన్న అన్ని దేశాల్లో వాట్సాప్​ చాట్​బాట్​ను ప్రయత్నించొచ్చు. అలా ప్రయత్నించినప్పుడు మన ఫీడ్​లో చాట్​బాట్​ను యాక్సెస్ చేస్తుంది. దీంతో పాటు వాట్సాప్​లో పంపే మెసేజ్​ల సంఖ్య లిమిటెడ్​గా ఉంటుంది. డైలీ లిమిట్​ పూర్తి కాగానే కంపెనీ ఆ విషయాన్ని తెలియజేస్తుంది.

అంతేకాకుండా చాట్​జీపీటీ కోసం వాట్సాప్​ చాట్​బాట్​ సపోర్ట్​ ఉన్న ఫీచర్​ల పరంగా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మెసేజింగ్​ యాప్​లో చాట్​జీపీటీతో మాత్రమే టెక్స్ట్ చాట్​లు చేయగలరు అని కంపెనీ చెప్తోంది. కానీ, త్వరలో మీరు చాట్​జీపీటీ సెర్చింగ్​, ఫొటోలతో చాట్ చేయడం, అన్ని కాన్వర్జేషన్​ మెమరీ లాగ్​ను కలిగి ఉండడం వంటి బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్​ ఉంది కదా అని చాట్​జీపీటీని వాట్సాప్​ గ్రూప్​లో యాడ్ చేయాలనుకుంటే మాత్రం వీలుకాదు.