టెక్నాలజీ : చాట్​జీపీటీతో చకచకా

చాట్​ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో పనిచేసే చాట్​బాట్ అని తెలిసిందే. ఇది .. బ్రౌజ్, విజన్, డేటా అనాలసిస్ అనే మరిన్ని కొత్త ఫీచర్స్​తో రెడీ అయింది. ఫ్రీ టైర్​లో వాడుతున్న వాళ్లు ఫైల్​ అప్​లోడ్ చేసే అవకాశముంది. అంటే.. చాట్​జీపీటీ యూజర్లు ఫైల్స్ అప్​లోడ్ చేసి, దాన్ని సమ్మరైజ్ చేయమని ఏఐ పవర్డ్​ చాట్​బాట్​ని అడగొచ్చు. అలాగే ఫైల్​ని రీఫ్రేజ్​ చేసి ఇవ్వమనొచ్చు. ఇలాంటి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అది కూడా ఒక నిమిషంలోపే! అదెలా సాధ్యం?

బ్రౌజర్​ లేదా మొబైల్ డివైజ్​లో చాట్​జీపీటీ ఓపెన్​ చేసి లాగిన్​ కావాలి. ఫ్రీగా చాట్​జీపీటీ బేసిక్ ఫీచర్లు వాడుతున్నవాళ్లు వీటిని వాడొచ్చు. కొత్త చాట్​ మొదలుపెట్టి లేదా ఓపెన్​ చేసిన దాంట్లోనే ‘పేపర్ క్లిప్’ ఐకాన్​ మీద క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త మెను ఓపెన్​ అవుతుంది. దాంతో ఏఐ పవర్డ్ చాట్​బాట్​ నుంచి గూగుల్ డ్రైవ్ లేదా మైక్రోసాఫ్ట్​ ఒన్​ డ్రైవ్​కి కనెక్ట్ అవ్వొచ్చు. దాంతో కంప్యూటర్​లోని ఫైల్​ని అప్​లోడ్ చేయాలి. డాక్యుమెంట్ ఎక్కుడుంది? అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆప్షన్​ ఎంచుకుని, చాట్​జీపీటీలో ఫైల్​ అప్​లోడ్ చేయాలి.

ఒకసారి అప్​లోడ్ చేశాక, టెక్స్ట్​ బాక్స్​కి వెళ్లి ఆ ఫైల్​ ద్వారా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో చాట్​జీపీటీకి చెప్పాలి. అప్పుడు చాట్​బాట్​  కావాల్సిన సమాధానాన్ని రెండు సెకండ్లలో కళ్ల ముందు ఉంచుతుంది. ఉదాహరణకు, ‘సమ్మరైజ్​ ది ఫైల్​’, ‘షో ఇంపార్టెంట్​ పాయింట్స్ ఫ్రమ్​ ద ఫైల్​ ఇన్​ బుల్లెట్ పాయింట్స్’ అని చాట్​జీపీటీకి చెప్తే... ఆ పని చేసి పెడుతుంది. అంతేకాదు, పెద్దగా ఉండే పీడీఎఫ్​ ఫైల్స్​ను కూడా డీల్ చేయగలదు ఓపెన్​ఏఐ చాట్​బాట్. చాట్​జీపీటీనే కాదు మైక్రోసాఫ్ట్​ కో–పైలట్, గూగుల్ జెమిని యూజర్లు కూడా అటాచ్​ ఫైల్స్, ఆస్క్ క్వశ్చన్స్ ఆప్షన్లను ఫ్రీగా వాడొచ్చు.