గెలిచేది ట్రంప్ కాదు.. కమలా కాదు.. అమెరికా ఫలితాలపై చాట్ జీపీటీ ఆసక్తికర అంచనా

ఈసారి డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‎లలో ఎవరూ అమెరికా ఎన్నికల్లో గెలవలేరంటూ ఏఐ టూల్ చాట్ జీపీటీ జోస్యం చెప్పింది. వీళ్లిద్దరూ వాళ్ల శక్తికి మించి కష్టపడ్డప్పటికీ రాత్రికిరాత్రి ఊహించని మరో వ్యక్తి అధికారం చేపడతారని అంచనా వేసింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చాట్​జీపీటీని ప్రశ్నించగా ఇలా విచిత్రమైన సమాధానం చెప్పింది. ఒకవేళ కమల అధికారాన్ని దక్కించుకోలేకపోయినా, భవిష్యత్‎లో ఆమె తిరిగి పుంజుకుంటారని పేర్కొంది. 

ఓడినప్పటికీ రాజకీయాల్లో ఆమె ప్రభావం అంతకంతకూ పెరుగుతుందని చెప్పింది. ట్రంప్ విషయంలోనూ చాట్ జీపీటీ ఇదేమాదిరి అంచనాలు వేసింది. ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా ట్రంప్ ప్రభావం ఏ మాత్రం తగ్గదంది. ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ వారసత్వాన్ని కొనసాగిస్తారని చెప్పింది. ఇక గూగుల్ జెమినిని గెలిచేదెవరని ప్రశ్నించగా.. తానేం చెప్పలేనని, గూగుల్‎లో సెర్చ్ చేయండని సూచించింది. గూగుల్ చాట్ బాట్ కూడా ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.