మే 10న చార్​ ధామ్​ యాత్ర ప్రారంభం... రోజుకు 16 వేల మందికి దర్శనం..

ఉత్తరాఖండ్‌లో మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా భక్తులు యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. గత సంవత్సరం సుమారు 55 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారు. దీని కారణంగా అనేక ఏర్పాట్లలో సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం దీని నుండి గుణపాఠం తీసుకొని ఉత్తరాఖండ్ పోలీసులు, పర్యాటక శాఖ చార్‌ధామ్ యాత్రలో భక్తుల కోసం రోజు వారీ పరిమితిని  విధించింది.

పర్యాటక శాఖ తెలిసిన వివరాల ప్రకారం.....చార్‌ధామ్ యాత్రలో, కేదార్‌నాథ్ ధామ్‌లోని బాబా మహాకాల్‌ను ఒక రోజులో 15 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగలరు. బద్రీనాథ్ ధామ్‌ను రోజుకు 16 వేల మంది, యమునోత్రిలో 9 వేల మంది భక్తులు, గంగోత్రిలో 11 వేల మంది భక్తులు దర్శించుకోనున్నారు. అంతే కాకుండా ఈ సంఖ్య పెరిగితే భక్తులను నిలువరించేందుకు త్రిషికేశ్‌లో అడ్డంకి పట్టణాలను కూడా సిద్ధం చేశారు. ఎవరైనా బద్రీనాథ్ వెళ్లాలనుకుంటే ముందుగా శ్రీనగర్‌లో నిలుపుతారని పర్యాటక శాఖ తెలిపింది. ఇక్కడి పరిమితి దాటితే భక్తులు రాత్రి ఇక్కడే గడపాల్సి వస్తుంది. దీని తర్వాత రుద్రప్రయాగ్, చమోలి, పిప్పల్‌కోటి, జోషిమఠ్‌లలో మరుసటి రోజు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే నంబర్ వస్తేనే మనం ముందుకు వెళ్లగలం.

యూపీ​  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. చార్​ధామ్​ యాత్రకు ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా తొలి 15 రోజుల్లో 10 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తారని అంచనా వేశారు. భక్తులు ఊహించని విధంగా వచ్చే అవకాశం ఉన్నందున మే 10 నుండి 25 వరకు వీఐపీలను రావద్దని లేఖలో తెలిపారు. 

చార్ ధామ్ యాత్రలో  మొదటి స్టాప్: హిందువులకు  చార్ ధామ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాఖండ్‌లో ఉన్న చార్ ధామ్ గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్. మొదలగువాటిని సందర్శిస్తారు.  చార్ ధామ్ యాత్ర యమునోత్రి నుండి ప్రారంభమవుతుంది యమునోత్రి నుండి ప్రయాణాన్ని ప్రారంభిస్తే, మీ చార్​ ధామ్ యాత్రలో ఇబ్బందులు ఉండవని టూరిజం శాఖ తెలిపింది.  యాత్ర పశ్చిమం నుండి ప్రారంభమై తూర్పున ముగుస్తుంది.  అందుకే ముందుగా యమునోత్రి ధామ్ సందర్శిస్తారు. 

రెండవ స్టాప్: యమునోత్రిని సందర్శించిన తరువాత, చార్ ధామ్ యాత్రలో  రెండవ స్టాప్ గంగోత్రి ధామ్. యమునోత్రి నుండి గంగోత్రి ధామ్‌కి దూరం దాదాపు 220 కిలోమీటర్లు ఉంటుంది.   కానీ అక్కడికి చేరుకోవడానికి  నడవాల్సిన అవసరం లేదు.  వాహనాల్లో  రోడ్డు మార్గంలో గంగోత్రి ధామ్‌కి సులభంగా చేరుకోవచ్చు. గంగోత్రి ధామ్ లో స్వామిని దర్శించుకుంటే   భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. 

మూడవ స్టాప్: శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ .. ఇదా చార్ ధామ్ యాత్రలో మూడవ స్టాప్.  శివుడు ఇప్పటికీ కేదార్‌నాథ్ ధామ్‌లో నివసిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడం ద్వారా భక్తులు కోరికలు నెలవేరుతాయని పండితులు చెబుతున్నారు.

 చివరి స్టాప్: బద్రీనాథ్ ధామ్.... చార్​ ధామ్ యాత్రకు చివరి స్టాప్. అలకనంద నది ఒడ్డున ఉన్న  విష్ణు ధామం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది.  బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించడం ద్వారా, భక్తుల అన్ని పాపాలు నశిస్తాయి .  భగవంతుని అనుగ్రహం పొంది ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా  జీవితం సాఫీగా కొనసాగుతుంది. 

చార్ ధామ్ చేరుకోవడం ఎలా: చార్ ధామ్ యాత్ర ఒక పవిత్ర  యాత్ర. ఈ తీర్థయాత్రను రోడ్డు, విమానం...  రైలు వంటి వివిధ రవాణా మార్గాలలో వెళ్లవచ్చు. . ఛార్ ధామ్ యాత్రలో  హిమాలయాల   అందాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వివిధ ప్రదేశాలలో స్టాప్‌లను కూడా అనుమతిస్తుంది.

ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత: గంగోత్రి-యమునోత్రికి వెళ్లే భక్తులను రోజు పరిమితి ముగిసిన తర్వాత తెహ్రీ, చంబా, ఉత్తరకాశీలో నిలిపివేస్తారు. ఈ పట్టణాల్లో ఒకేసారి 20 నుంచి 30 వేల మంది బస చేయగలుగుతారు. ఇక్కడ హోటల్, హోమ్ స్టే సౌకర్యాలు ఉన్నాయి. ఇదే సమయంలో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై టూరిజం శాఖ రోజువారీ పరిమితిని విధించడంపై హోటల్, హోమ్ స్టే వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో అసోసియేషన్ ప్రకారం.. ఇది వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. ఉత్తరకాశీ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకారం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేవలం టూరిజం, తీర్థయాత్రలపై ఆధారపడి ఉంటుంది. ఆరు నెలల కాలంలో కూడా భక్తుల సంఖ్య పరిమితంగా ఉంటే, వారి వ్యాపారం తగ్గుతుంది. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే హోటళ్లు, హోమ్‌స్టేలు మూతపడతాయి. ఉత్తరాఖండ్‌లో, ఆది కైలాష్, ఓం పర్వతాలకు రోడ్డు మార్గంలో ప్రయాణం కూడా దాదాపు ఒకటిన్నర నెలల ముందుగానే ప్రారంభమవుతుంది. ఈసారి మే 10వ తేదీన ఆది కైలాస దేవాలయం తలుపులు తెరుచుకోనున్నాయి.