చంద్రయాన్ 3 నుంచి చాట్ జీపీటీ వరకు : ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది వీటినేనట

2023 ముగింపును పురస్కరించుకుని గూగుల్ తన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2023' జాబితాను ఆవిష్కరించింది, ఏడాది పొడవునా ఇంటర్నెట్ సెర్చింగ్ లో ఆధిపత్యం వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన అంశాలు, ప్రశ్నలు, ఆసక్తులను ప్రదర్శించింది. ఈ జాబితాలో వార్తలు, వినోదం, మీమ్స్, ప్రయాణం, వంటకాలు వంటి ఎన్నో అంశాలున్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిలో చంద్రయాన్ 3 అగ్రస్థానంలో నిలిచింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన నాల్గవ దేశంగా భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తించింది. నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్, 'ఫ్రెండ్స్' స్టార్ మాథ్యూ పెర్రీ కూడా ఇంటర్నెట్ యూజర్స్ ని ఆకర్షించారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం కూడా ఈ జాబితాలో ఉంది. సమగ్ర జాబితాలో చాట్ జీపీటీ (ChatGPT), ఇన్ స్టాగ్రామ్(Instagram), యూనిఫాం సివిల్ కోడ్ గురించిన యూజర్ల ప్రశ్నలు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశాల్లో ఉన్నాయి.

ఇంటర్నెట్ యూజర్స్ సెర్చ్ చేసిన టాప్ 10 ఈవెంట్స్

  •     చంద్రయాన్-3
  •     కర్ణాటక ఎన్నికల ఫలితాలు
  •     ఇజ్రాయెల్ వార్తలు
  •     సతీష్ కౌశిక్
  •     బడ్జెట్ 2023
  •     టర్కీ భూకంపం
  •     అతిక్ అహ్మద్
  •     మాథ్యూ పెర్రీ
  •     మణిపూర్ వార్తలు
  •     ఒడిశా రైలు ప్రమాదం

ఈ ఏడాది గూగుల్ సెర్చింగ్ లో క్రికెట్ కు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబర్చారు.

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • క్రికెట్ ప్రపంచ కప్
  • ఆసియా కప్
  • మహిళల ప్రీమియర్ లీగ్
  • ఆసియా క్రీడలు
  • ఇండియన్ సూపర్ లీగ్
  • పాకిస్థాన్ సూపర్ లీగ్
  • యాషెస్
  • మహిళల క్రికెట్ ప్రపంచ కప్
  • SA20

"How To" జాబితాలో హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి ఇళ్లను రక్షించడం నుండి చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఇంటి చిట్కాల వరకు ప్రశ్నలు ఉన్నాయి.           

  • ఇంట్లో ఉండే పదార్థాలతో చర్మం, జుట్టుకు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని ఎలా నివారించాలి
  • యూట్యూబ్ లో 5వేల ఫాలోవర్స్ ను ఎలా తెచ్చుకోవాలి
  • కబడ్డీలో రాణించటం ఎలా
  • కారు మైలేజీ పెరగాలంటే ఏం చేయాలి
  • చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా ఎలా మారాలి
  • రక్షాబంధన్ రోజున నా సోదరికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి
  • స్వచ్ఛమైన కంజీవరం పట్టు చీరను ఎలా గుర్తించాలి
  • ఆధార్‌తో పాన్ లింక్‌ని ఎలా తనిఖీ చేయాలి
  • వాట్సాప్ ఛానెల్‌ని ఎలా క్రియేట్ చేయాలి
  • ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ను ఎలా పొందాలి

                                                            
ఈ జాబితాలో చాట్‌జీపీటీ, ఇన్‌స్టాగ్రామ్, యూనిఫాం సివిల్ కోడ్ గురించిన విషయాలు కూడా ఉన్నాయి:

  •     G20 అంటే ఏమిటి
  •     UCC అంటే ఏమిటి
  •     ChatGPT అంటే ఏమిటి
  •     హమాస్ అంటే ఏమిటి
  •     28 సెప్టెంబర్ 2023 ప్రత్యేకతేమిటి?
  •     చంద్రయాన్ 3 అంటే ఏమిటి?
  •     ఇన్‌స్టాగ్రామ్‌లో థ్రెడ్స్ అంటే ఏమిటి
  •     క్రికెట్‌లో timed out అంటే ఏమిటి
  •     IPL లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏమిటి?
  •     సెంగోల్ అంటే ఏమిటి