చంద్రయాన్-3 విజయానికి నేటితో ఏడాది

బెంగళూరు:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3 మిషన్ విజయానికి శుక్రవారం నాటితో ఏడాది పూర్తవుతోంది. 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను విజయవంతంగా దింపిన ఇస్రో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా రికార్డ్ సృష్టించింది.

దీంతో చరిత్రాత్మకమైన ఈ విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23ను ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా సెలబ్రేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్–3 విజయానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇస్రో గురువారం ఈ మిషన్ ఫొటోలను రిలీజ్ చేసింది. చంద్రుడిపైకి దిగడానికి ముందుగా విక్రమ్ ల్యాండర్ లోని ఇమేజర్ కెమెరా, ల్యాండింగ్ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ లోని నావిగేషన్ కెమెరా తీసిన చంద్రుడి ఉపరితలం ఫొటోలను ఇస్రో షేర్ చేసింది.