జార్ఖండ్ ప్రయోజనాల కోసమే బీజేపీలోకి.. జేఎంఎంకు రిజైన్ చేస్త: చంపయీ సోరెన్

రాంచీ: జార్ఖండ్ ప్రజల ప్రయోజనాల కోసమే తాను బీజేపీలో  చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర  మాజీ సీఎం చంపయీ సోరెన్ వెల్లడించారు. మంత్రి పదవితోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీకి త్వరలో రిజైన్ చేస్తానని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానని స్పష్టంచేశారు. బుధవారం ఆయన రాంచీలో మీడియాతో మాట్లాడారు.

"నేను పోరాటాలకు అలవాటు పడినవాడ్ని. బీజేపీలో చేరాలనే నా నిర్ణయం జార్ఖండ్ ప్రయోజనాల కోసమే. త్వరలో జేఎంఎం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తా. నేను ఎటువంటి పరిస్థితులకూ భయపడ" అని చంపయీ చెప్పారు.