ఎనుమాముల మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాశీబుగ్గ, వెలుగు : ఎనుమాముల మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ, జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చాంబర్​ఆఫ్​ కామర్స్​ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్ లో చాంబర్ ఆప్​ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, కార్యవర్గంతో మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ నిర్మాణానికి  అనుమతించాలని కోరారు. ప్రతినిధులు కటకం పెంటయ్య, అల్లే సంపత్, చింతలపల్లి వీరారావు, ఎన్ రెడ్డి లింగారెడ్డి, రాజేశ్, కరాణి, గొని సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.