చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి

  • రాష్ట్ర మహిళా కమిషన్  సభ్యురాలు శ్వేతా ఐలమ్మ 

మఠంపల్లి, వెలుగు : చాకలి ఐలమ్మ ను రజకులు అందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత ఐలమ్మ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మట్టపల్లి గ్రామం లో రజకులకార్తీక వన భోజనాలకు ముఖ్య అతిధిగా హాజరైమాట్లాడారు. 

రజకులు రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం గా ఉంటేనే తమ శక్తి అందరికి అర్థం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో రాచకొండ బాబు, శ్రీనివాస్, కృష్ణయ్య కోటయ్య తదితరులు 
పాల్గొన్నారు.