ఆసరా పించన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తానని.. వృద్ధురాలి మెడలోంచి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్ చోరీ

​ కోరుట్ల, వెలుగు: ఆసరా పించన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తానని ఓ వృద్ధురాలిని నమ్మించి ఆమె మెడలోని బంగారం చైన్ , చెవి కమ్మ తీసుకుని దొంగ పారిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన  దుప్పల గంగు(78) శుక్రవారం కోరుట్ల వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నంది చౌరస్తా బస్టాప్​వద్ద బస్సు కోసం నిలబడింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి  వచ్చి.. అమ్మ నీకు పించన్​ వస్తుందా అని అడుగగా రావట్లేదని ఆమె బదులిచ్చింది. తాను తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నని, నీకు పించన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తానని నమ్మించాడు. 

ఫొటో దించాలని చెప్పి ఆమెను బస్టాప్​ పక్కన ఉన్న గల్లీలోకి తీసుకెళ్లాడు. మెడలో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చెవి కమ్మలు ఉంటే ఫొటోలో కనపడతాయని, అలా అయితే పెన్షన్ రాదని నమ్మబలికాడు. దీంతో 2 తులాల బంగారం చైన్​, అరతులం కమ్మ ఆమె అతనికిచ్చింది. ఫొటో దించేందుకు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపటికి రాకపోవడంతో విషయం స్థానికులకు చెప్పింది. విషయం తెలుసుకున్న సీఐ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, ఎస్సై శ్రీకాంత్​ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.