ప్రధాని మోది కృషి ఫలించాలి: కేంద్రమంత్రి బండి సంజయ్​

దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవారిని  కేంద్రమంత్రి బండి సంజయ్​ దర్శించుకున్నారు.  ప్రత్యేక పూజలు చేసిన తరువాత.. మీడియాతో మాట్లాడిన ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.  విశ్వ గురు స్థానంలో భారత్​ ను ఉంచేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి ఫలించాలంటూ... శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాడుపడామన్నారు. 

Also Read :- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక పూజలు

 దేశాభావృద్దిలో తెలంగాణను భాగస్వామ్యం చేసి.. ఇప్పటి వరకు జరిగిన మంచి చెడులను లెక్కలేసుకుని అందరికి మంచి జరగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు.  గతంలో పడిన కష్టాలు .. ఇబ్బందులు తొలగి పోవాలని .. అందరికి మంచి జరగాలని..  స్వార్ధం, కల్మషం వీడి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు.