ఆర్గాన్ డొనేషన్​కు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ

  • కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

న్యూఢిల్లీ : ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్​ప్లాంటేషన్​కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పాలసీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎస్ చాంగ్సన్ తెలిపారు. ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ ప్లాంటేషన్ కు సంబంధించి టెక్నాలజీ, చట్ట పరంగా తీసుకురావాల్సిన సంస్కరణలపై ఢిల్లీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నారు. 

ALSO READ :>వరంగల్‌ హెల్త్‌ సిటీపై విచారణ షురూ!

రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎల్ఎస్ చాంగ్సన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘‘అవయవదానం అనేది జీవన విధానంగా మారాలి. అప్పుడు మనం ఆర్గాన్ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న ఎంతో మందికి కొత్త జీవితం ఇవ్వగలం” అని అన్నారు. ఆర్గాన్ డొనేషన్ ను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్​ప్లాంటేషన్​కు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నామని చెప్పారు.