అప్పుడు బీఆర్​ఎస్ అవినీతి చేస్తే ​.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ​: కేంద్రమంత్రి బండి సంజయ్​

తెలంగాణలో అధికార.. ప్రతిపక్షాల చర్యలను కేంద్రహోంశాఖ మంత్రి బండి సంజయ్​ తప్పు పట్టారు.  బీఆర్​ఎస్​ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయిలు అవినీతి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మూసీ పేరుతో అవినీతి చేస్తుందన్నారు.  గత ప్రభుత్వం  అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్​ఎస్ వసూళ్లకు పాల్పడిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని.. అప్పులు తెచ్చి మూసీ ప్రక్షాళన అవసరమా అని ప్రశ్నించారు . ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అన్న కేంద్ర మంత్రి..  హైడ్రా తీరును ప్రజలు తప్పుపడతున్నారన్నారు .

హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమం చేపడుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు.  మా ప్రాణాలు తీశాకే.. ప్రజల ఇండ్లపై దాడులు చేయాలని ఆయన అన్నారు.  అవినీతికి కేరాఫ్​ గా కుటుంబ వారసత్వ పార్టీలు ఉన్నాయంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు సామాన్య కార్యకర్తలను పట్టించుకోకుండా...  కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు.