ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...

జగిత్యాల జిల్లాలో ఓ హోటల్ డొల్లతనం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి షాక్ తగిలింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన ఒక కుటుంబం ఆదివారం ( అక్టోబర్ 13, 2024 ) ఉదయం టిఫిన్ చేయడానికి హోటల్ కి వెళ్లారు. చిన్న పిల్లాడి కోసం ఇడ్లీ ఆర్డర్ ఇవ్వగా.. అందులో జెర్రి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ల .. హోటల్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో ఇడ్లిలను మున్సిపల్ చెత్త బండిలో పడేయడానికి యత్నించగా...హోటల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు కస్టమర్లు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హోటల్ లో ఉన్న మిగతా కస్టమర్లను బయటికి పంపి.. హోటల్ ని మూసివేసి జరిమానా విధించారు.  ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కస్టమర్లు.